ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ నాగరికతకు మూలం ఆదివాసీ సంస్కృతి అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని దైవంగా,
అడవిని తల్లిగా భావించే ఆదివాసీలు తమ సంస్కృతీ సంప్రదాయాలను తరతరాలుగా కాపాడు కుంటున్నారని కొనియాడారు. ‘తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను తమ జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయా లు, సమిష్టి జీవన విధానం, సాంస్కృతిక పరిరక్షణ… యావత్ మానవాళికి మార్గదర్శకం. వారి హక్కులను, అస్తిత్వాన్ని, సంస్కృతిని గౌరవిస్తూ… వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం మనమంతా కలిసి నిలబడాలి…’ అని సీఎం పేర్కొన్నారు.
ప్రపంచ నాగరికతకు మూలం ఆదివాసీ సంస్కృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



