ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాళోజీ కి ఘన నివాళి

– కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బంటు కవిరాజు
నవతెలంగాణ -నెల్లికుదురు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురులోనీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు  వర్ధంతి నీ ఘనంగా నిర్వహించినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బంటు కవిరాజు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సకట్ల అనిల్ తెలిపారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ బంటు కవిరాజ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు మాట్లాడుతూ ప్రశ్నించడం, ధిక్కారానికి పర్యాయపదం కాళోజీ అని, ఆయన తన కవిత్వంలో నాటి సమాజంలో తెలంగాణ ప్రజలపై, తెలంగాణ భాషపై, తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న దాడిని, ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షపై తన రచనలలో తీవ్రంగా ఖండించే వారని, కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారని, తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. అలాగే ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారని, తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాపకులు రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మహేందర్, సుధాకర్, యాకన్న, సతీష్, స్పందన, అధ్యాపకేతర బృందం సైదా, ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Spread the love