తెలుగు వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సోమవారం నివాళులర్పించారు.ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. దాశరథి కవిగా, రచయితగా, హైదరాబాద్ సంస్థాన పోరాటాయోధుడిగా, సాహితికారునిగా బహుముఖ సేవలు అందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన పద్యగేయం కోటి రతనాల వీణ నా తెలంగాణ దాశరథి నిజాం పాలనకాలంలో జైలుశిక్ష అనుభవించిన నిజామాబాద్ జైలు గొడ్లపైనేనని ఆయన అన్నారు. తెలుగునెలపై సాహితి సుమాలు వెదజల్లి ఆంద్ర, తెలంగాణ ప్రాంతాల్లోని జనజీవనంలో మమేకమై సాహితీమూర్తిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి డొన్పల్ సురేష్, కోశాధికారి దీపక్,న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్,పరుచూరి శ్రీధర్ ,మాజీ పిపి మధుసూదన్ రావు,సుదర్శన రావు,ఆశా నారాయణ,స్నేహ,బిట్ల రవి,అరేటి నారాయణ,నిశాంత్,ఎరగట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.