హాస కొత్తూర్ లో ముగ్గుల పోటీలు

నవతెలంగాణ –  కమ్మర్ పల్లి
మండలంలోని హాసకొత్తూర్ లో ఆదివారం  గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవంలో భాగంగా మహిళలకు మహాదేవస్వామి ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో భాగంగా అందమైన ముగ్గులు మహిళలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి సిహెచ్. మాధవి, ద్వితీయ బహుమతి ఆర్.వనిత, తృతీయ బహుమతి ఎం.శ్రీనిధి, నాలుగవ బహుమతి సిహెచ్. సంజన, ఐదవ బహుమతి అనన్య లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోమ్ముల రజినీకాంత్, కార్యదర్శి కుందారం శ్రావణ్, ఉపాధ్యక్షులు రాజుల చిన్న బాబయ్య, కోశాధికారి రాధారపు నర్సయ్య, రైటర్ పెద్ది ధన్ రాజ్, ఖాతాదారు కొమ్రే అంజయ్య, గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, నోముల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love