త్రివర్ణ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ నియమాకం 

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని పెరకబండ గ్రామంలో త్రివర్ణ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల నియమాకం అదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా కొంపెల్లి సుమన్, ఉపాధ్యక్షుడిగా గాలిపెల్లి శ్రీనివాస్, కొంపెల్లి మధు,ప్రధాన కార్యదర్శిగా కొంపెల్లి అరవింద్,కోశాధికారిగా లింగంపెల్లి జైపాల్, సంయుక్త కార్యదర్శిగా కొంపెల్లి సిద్దు,కొంపెల్లి అజయ్ నియమాకమైయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను ఉప సర్పంచ్ కొంపెల్లి బాబు అభినందించి శాలువా కప్పి సన్మానించారు.కొంపెల్లి ప్రశాంత్,గాలిపెల్లి సంపత్,కొంపల్లి ప్రభాకర్,కొంపెల్లి ప్రసాద్,లింగంపల్లి అనిల్ పాల్గొన్నారు.
Spread the love