ట్రంప్‌ను తప్పుదోవ పట్టిస్తోందా..?
యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ఆందోళన
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం మొదలైన రోజే అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమైన విషయం విదితమే. దాంతో అక్కడ పాలనా వ్యవస్థ కూలిపోయి, తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుందని అమెరికా భావించింది. కానీ అలా జరగగా పోగా సీన్ రివర్స్ అయ్యింది. తమ మిలిటరీ శక్తి ముందు ఇరాన్ నిలబడలేదన్న అంచనాలు తప్పాయి. దాంతో యుద్ధం ముగింపు కోసం అమెరికా మల్లగుల్లాలు పడు తోంది. ఈ నేపథ్యంలో యుద్ధంపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుంచి సరైన సమాచారం అందడం లేదన్న వార్తలు వస్తున్నాయి.యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మెన్ జనరల్ డాన్ కెయిన్ ఇస్తున్న వివరాలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆందోళన వ్యక్తం చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొం టున్నాయి. వాస్తవానికి యూఎస్ రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ యుద్ధం తో ప్రయోజనం పొందటానికి ట్రంప్ కార్యాలయాన్నే వేదికగా మార్చుకున్నారని మీడియా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు హెగ్సెత్‌పైనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి.
భిన్న వాదనలు..
ఇరాన్ సైనిక శక్తిని భారీగా దెబ్బతీశామని, అమెరికాలో ఆయుధ నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని పీట్ హెగ్సెత్, కెయిన్ చేస్తున్న ప్రకటనలపైనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అధ్య క్షుడు ట్రంప్‌నకు ఇస్తున్న ఆ సమా చారంపై అంతర్గత సమావేశంలో వాన్స్ పదేపదే ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. వాస్తవానికి అమెరికా వద్ద కీలక క్షిపణి నిల్వలు తరిగిపోతున్నట్టు వస్తున్న కథ నాలు యూఎస్ పెద్దలకు మింగుడు పడటంలేదు. ఈ నేపథ్యంలో నిల్వల తరుగుదలను తక్కువ చేసి చూపిస్తు న్నారా..? అని వారిని అడిగినట్టు తెలు స్తోంది. భవిష్యత్తులో రష్యా, ఉత్తర కొరియా, చైనాలతో ఏవైనా ఘర్షణలను ఎదుర్కోవాల్సివస్తే.. ఈ క్షిపణి నిల్వల కొరత తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చని ఉపాధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేసినట్టు లీకులు వస్తున్నాయి.
పెంటగాన్‌లో ముసలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



