నవతెలంగాణ-మిడ్జిల్
టీయూడబ్ల్యూజే (హెచ్-143) మిడ్జిల్ మండల నూతన కమిటీని గురువారం జిల్లా అడ్‌హక్ కమిటీ కన్వీనర్ వరంగల్ శివకుమార్, కో-కన్వీనర్ చింతకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బాల్ రెడ్డి (సాక్షి) ప్రధాన కార్యదర్శి, శ్రీనివాసులు (దిశా) ఉపాధ్యక్షులుగా భీమ్ రాజ్, (జనంసాక్షి), షేక్ సలీం, (జనంస్ఫూర్తి) నర్సింలు, (ప్రజాప్రతిభ) కోశాధికారి బాల నారాయణ, (నేటి దర్శిని) సంయుక్త కార్యదర్శిగా వరుణ్, (నమస్తే తెలంగాణ) ప్రచార కార్యదర్శిగా ఎర్రోళ్ల మల్లేష్, (వెలుగు) కార్యనిర్వాహక సభ్యులు సి.రాఘవేందర్, (మనం) రమేష్, (మెట్రో ఈవినింగ్) రవీందర్ రెడ్డి గిరిజన సంస్కృతి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ చారి, నరేందర్ గౌడ్, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. అంతకుముందు ముందు అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో మిడ్జిల్ మండల సభ్యులకు యూనియన్ సభ్యత్వ కార్డులను అందజేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు.


