- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ మిస్ పుణె, నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమె అత్త గిరిబాలా సింగ్‌ను భోపాల్‌లో సీబీఐ అరెస్టు చేసింది. ఇటీవల భోపాల్‌లోని అత్తవారింట్లో ట్విష ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమెకు పెళ్లై ఐదు నెలలే. మృతి చెందడానికి ముందు తన తల్లి, స్నేహితురాలికి ఆమె పలు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. తాను వేధింపులకు గురవుతున్నానని వాటిల్లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ట్విషా శర్మ మృతి కేసును.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారిస్తోంది.
- Advertisement -



