హైదరాబాద్ : మెరుగైన ఆర్థిక పొదుపు ఎంపికలపై వ్యక్తులలో అవగాహన కల్పించడానికి వినూత్న ప్రచారాన్ని చేపట్టామని ఉజ్జీవన్ ఎస్‌ఎఫ్‌బి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ వేలాయుతం పేర్కొన్నారు. ఫుట్‌ఫాల్ స్మోకింగ్ జోన్‌లలో సృజనాత్మకంగా రూపొందించిన సిగరెట్ బాక్సులను పంపిణీ చేస్తోన్నట్లు తెలిపారు. ‘ప్రతి సిగరెట్ ప్యాక్‌ను తగ్గించుకోవడం ద్వారా మరింత పొదుపు చేయడం ఆరోగ్యకరమైన అలవాటు’ అనే సందేశంతో ఈ బాక్స్‌లను తయారు చేసినట్లు తెలిపారు. ప్రపంచ రహిత పొగాకు దినోత్సవం నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.