మైనార్టీ గురుకులాలకు ప్రకటించని సెలవులు

– ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు.
నవతెలంగాణ – సూర్యాపేట
రంజాన్ పండగ సందర్భంగా ఇప్పటివరకు మైనార్టీ గురుకులాలకు సెలవులు ప్రకటించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.సంవత్సరానికి ఒకసారి వచ్చే రంజాన్ పండుగ సందర్భంగా తల్లిదండ్రులు అన్ని స్కూళ్ల ముందు  పిల్లల కోసం ఎండలో ఉపవాసం ఉంటూ ఎదురు చూస్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ క్రమంలో రంజాన్ పండుగ ఇంకా రెండు మూడు రోజుల్లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సంబంధించిన శాఖ వారు పాఠశాలలకు సెలవులు ప్రకటించక పోవడం గమాన్హారo. పండగ 10  లేదా 11 వ తేదీన జరుపుతారా అనేది ఖచ్చితంగా ఇంకా నిర్ణయింపబడలేదు. దీంతో  తల్లిదండ్రులు తమ పిల్లల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగాక పిల్లలకు కొత్త బట్టలు కొనుగోలు చేసుకొని  పండుగకు సన్నద్ధం అవ్వాల్సి ఉందని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఉగాది, రంజాన్ పండుగ లను పురస్కరించుకుని 15 వ తేదీ నుండి పరీక్షలు నిర్వహిస్తున్నది. అయినప్పటికీ సంబంధిత శాఖ సెక్రటరీ అయేషా మస్రత్ ఖానం మాత్రం గురుకులాలకు నేటి వరకు కూడా సెలవులు ప్రకటించలేదు.ప్రస్తుతం పాఠశాలల్లో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు గల పిల్లలు మాత్రమే ఉన్నారు. వీరికి ఎటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా లేవని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.కాగా దేవుడు కరుణించినా పూజారి కనికరించడన్నట్టు గా గురుకులాల సెక్రటరీ పరిస్థితి నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుండగా రంజాన్ పండగ కు  సెలవులు ఇస్తారని తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికైనా సెక్రటరీ స్పందించి విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని అవాజ్ జిల్లా కార్యదర్శి జహంగీర్ డిమాండ్ చేశారు.
Spread the love