యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల కు పరీక్షా సామాగ్రి అందజేత

– విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరుకోవాలి..
– వేములవాడ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మారుతీ,యువ ఫౌండేషన్   వ్యవస్థాపకులు కానిస్టేబుల్  రాజశేఖర్ గౌడ్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండల పరిధిలో గల 8 ప్రభుత్వ పాఠశాలల యందు 10వ తరగతి విద్యార్థుల  కు ఈ నెల 18 వ తేదీ నుండి జరగబోయే పరీక్షల దృష్ట్యా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పరీక్ష సామాగ్రి అందజేయటం జరిగింది అని యువ ఫౌండేషన్   వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ విద్యార్థుల ను ప్రోత్సహించుటకు తమ వంతుగా పరీక్ష సామాగ్రి ని అందించి పిల్లలను ఉత్తేజ పరుస్తూ పిల్లలకు పరీక్షల సమయం లో తీసుకోవాల్సిన విలువైన సూచనలు చేస్తున్న యువ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలియజేసారు. యువ ఫౌండేషన్   వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ప్రోత్సహకంగా గత 5 సంవత్సరాలనుండి పరీక్ష సామాగ్రి అయిన ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్, స్కేల్స్,ఏరేజర్లు ,షార్ప్ నర్స్ తదితర సామాగ్రి అందించటం జరిగింది అని, తెలిపారు.అదేవిదంగా విద్యార్థుల కు పరీక్ష పట్ల భయం ఉండకుండా పలు సూచనలు చేస్తూ, పరీక్షల పట్ల అవగాహన కల్పిస్తూ, పరీక్షలు రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త ల గురించి వివరిస్తూ,పరీక్ష లు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని తమ కుటుంబానికి, పాఠశాల కి మంచి పేరు తేవాలని అన్నారు. ఉన్నత విద్యకు పదవ తరగతి మొదటి మెట్టు గా భావించి పరీక్షలు బాగా రాయాలి అని భవిష్యత్ లో ఉన్నత స్థితి లో ఉండాలి అని విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యువ ఫౌండేషన్ సభ్యులు  రాంకుమార్, ప్రదీప్,వెంకటేష్, ప్రశాంత్,రాహుల్, సంతోష్,హేమంత్  విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love