నిరుద్యోగుల హామీలను వెంటనే అమలు చేయాలి..

– డి ఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి
– గత ప్రభుత్వం 10 ఏళ్లలో నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు
– విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పంతం విజయేందర్
– ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్యామ్
నవతెలంగాణ  – నెల్లికుదురు 
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ మహబూబాబాద్ జిల్లా చైర్మన్ పంతం విజయేందర్ ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్యామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉంటే తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో నిరుద్యోగ నాయకుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రెండు సార్లు గెలిచి 10 సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగా పోవడంతో నిరుద్యోగులు అవస్థలు పడ్డారని అన్నారు. పెద్ద పెద్ద చదువులు కష్టపడి చదివి న వారికి వయస్సు వయోపరిమితి కూడా కొంతమందికి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చెందారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మెగా డీఎస్సీని త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసి, మరికొన్ని రెండు లక్షల ఉద్యోగాలకు మాట ఇచ్చిన ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో జరిగిన విధంగా పేపర్ లీ కేజీలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఉద్యోగుల ఎంపిక విషయంలో అలసత్వం జరగకుండా కట్టుదిట్టంగా ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా కల్పించుట కు కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ గత ప్రభుత్వం మా సహాయాన్ని పొంది మాకు మాత్రం కూడా సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు గత ప్రభుత్వం మా నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహ వ్యక్తం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీను,ఉపేందర్,వెంకట్,ప్రవీణ్ ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love