నందు, అవికా గోర్ జంటగా నటించిన సినిమా ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ రచన, దర్శ కత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మించారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీం మీడియాతో కలిసి థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. హీరో నందు మాట్లాడుతూ,’ మా సినిమాకు మంచి విజయం ఇచ్చినందుకు ముందుగా మీడియా వారికి, ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమా ఉదయంతో పోలిస్తే విడుదల అయిన రోజు సాయంత్రానికి ముందుకు వెళ్ళింది. మా సినిమాకు ఎంతో జెన్యూన్ రివ్యూస్ వచ్చాయి. నన్ను మీ ఇంట్లో మనిషిగా ఫీలై, మా సినిమాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. రీసెంట్ గా వచ్చిన సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి. దాని వల్ల మంచి కథలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాలో నా నటన వల్ల నాకు మంచి స్పందన వస్తుంది అని నేను ముందుగానే అనుకున్నాను. అనుకున్నట్లే నాకు ఈ సినిమాతో మంచి పేరు తెచ్చింది.
ప్రస్తుతం అమ్మాయిలు గతంతో పోలిస్తే బలంగా ఉంటున్నారు. భర్త క్రూరంగా ఉంటే భార్యకు అతడిని భరించవలసి అవసరం లేదు. ఈ విషయంలోను ఆడవారిని సపోర్ట్ చేస్తాను. నేను గతంలో సెలెక్ట్ చేసుకున్న కథలతో పోలిస్తే ఇప్పుడు కథలు సెలెక్ట్ చేయడంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఇకపై రానున్న సినిమాలు కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేలా ఉంటాయి. ఈ సినిమాలో నా పాత్ర, పెర్ఫార్మెన్స్ కు వచ్చిన స్పందనకు 95% మా దర్శకునికే. సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉండాలో ఆయన కచ్చితంగా వచ్చేలా చూసుకున్నారు. ‘ఈ సినిమా ముందుగా చూసి నప్పుడు బావుంది అనిపించింది కాని విడుదల అయిన వెంటనే మీడియా, ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనకు నాకు ఈ సినిమా మంచి పేరు వస్తుంది అని అనిపించింది. నందుకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది` అని బెక్కం వేణుగోపాల్ చెప్పారు.
‘అగ్లీ స్టోరీ`కి అనూహ్య స్పందన
- Advertisement -
- Advertisement -



