ఎఫ్‌డీలపై యూనియన్‌ బ్యాంక్‌ వడ్డీ పెంపు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీపై పెంచిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు జూన్‌ 1నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొంది. సాధారణ ఖాతాదారుల ఎఫ్‌డిలకు సంబంధించి.. 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీపై 3.5 శాతం వడ్డీ అందిస్తోంది. 45 రోజుల నుంచి 90 రోజుల కాలవ్యవధి ఎఫ్‌డీలపై 4.50 శాతం, 91 రోజుల నుంచి 180 రోజుల మధ్య 4.80 శాతం, 181 రోజుల నుంచి ఏడాది లోపల 6.25 శాతం వడ్డీ చెల్లించనుంది. ఏడాది నుంచి 399 రోజుల కాలవ్యవధి ఎఫ్‌డీ రేట్లను 6.75 శాతం, 399 రోజులకు చేసే ఎఫ్‌డీపై 7.25 శాతం, 400 రోజుల నుంచి 998 రోజుల మధ్య 6.50 శాతం, 1000 రోజులు నుంచి 10 ఏళ్ల మధ్య 6.50 శాతం వడ్డీ రేటు అందిస్తోన్నట్లు పేర్కొంది. సీనియర్‌ సిటిజన్స్‌ అదనంగా 0.5 శాతం వడ్డీ పొందనున్నారని తెలిపింది.

Spread the love