యూనియన్ బ్యాంక్ సేవలు అభినందనీయం 

– 108 ఫెటల్ డాప్లర్ పంపిణీ చేసిన మంత్రి
నవతెలంగాణ – సిద్దిపేట
ప్రభుత్వ ఆసుపత్రులకు 108 ఫెటల్ డాప్లర్ లు అందించిన యూనియన్ బ్యాంక్ సేవలు అభినందనీయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం 1000 పడకల ఆసుపత్రిలో ఫెటల్ డాప్లర్ లను మంత్రి పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ వికాస్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో  అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి చైర్ పర్సన్ రోజా శర్మ, ఆడిషినల్ కలెక్టర్ గరిమా ఆగ్రవాల్, జిల్లా వైద్య ఆదికారి కాశినాథ్, ఆసుపత్రి ప్రిన్సిపాల్ విమాల థామస్,  వైస్ రీజినల్ మేనేజర్ రాఘవ, చీఫ్ మేనేజర్ ప్రదీప్ సింగ్, సిబ్బంది భరత్   తదితరులు పాల్గొన్నారు.
Spread the love