వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న  కేంద్ర బడ్జెట్‌..

– ఫిబ్రవరి 3న రాష్ట్రవ్యాప్త నిరసనలు 
– తెలంగాణ రైతు సంఘం పిలుపు..
నవతెలంగాణ –  మునుగోడు
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం దారుణమని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ
2024 ,25 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.2,22,281 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ వాస్తవంగా కేటాయించింది రూ.1,17,528.79 కోట్లు మాత్రమే అని ఆరోపించారు . వ్యవసాయరంగాభివృద్ధికి నిధులు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆర్థిక మంత్రి పదే పదే బడ్జెట్‌ ఉపన్యాసంలో చెప్పినా వాస్తవ బడ్జెట్‌లో అందుకు సంబంధించిన కేటాయింపులు చేయకపోగా కార్పొరేట్లకు వ్యవసాయరంగాన్ని కట్టబెట్టేందుకు పూనుకున్నది అని పేర్కొన్నారు. రైతందానికి  కేంద్ర బడ్జెట్ కేటాయింపుకు  నిరసనగా  ఫిబ్రవరి 3 తేదీన న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని అని తెలంగాణ రైతు సంఘం కు పిలుపునిచ్చారు. దేశం బాగుకు పేదలు, యువకులు, మహిళలు, రైతులు మాత్రమే కీలకమని చెప్తూ రైతులకు అనేక లాభాలు, రాయితీలు కల్పించినట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. పియం కిసాన్‌ నిధి కింద 11.8 కోట్ల మందికి సంవత్సరానికి రూ.6,000ల చొప్పున ఇస్తున్నట్లు బడ్జెట్‌లో చెప్పారు దారుణమని మండిపడ్డారు. దేశంలో 14.75 కోట్ల మంది రైతులు ఉండగా వాస్తవంగా కిసాన్‌ సమ్మాన్‌ పథకం 8 కోట్ల మందికి మాత్రమే పంపిణీ జరుగుతున్నది. సన్న ,చిన్నకారు రైతులను నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నదని  అన్నారు . ఫసల్‌భీమా 4 కోట్ల మందికి ఉపయోగపడుతున్నదని ప్రకటించారు. వాస్తవానికి 2.85 కోట్ల మందికి మాత్రమే ఫసల్‌బీమా క్లైంలు వస్తున్నాయి అని ఆరోపించారు . పంట నష్టం జరిగిన నష్టంలో 25 శాతానికి మించడం లేదు. ప్రీమియంతో ఇన్సూరెన్స్‌ కంపెనీలు వేలకోట్లు లాభాలు అర్జించడాన్ని గమనించి తెలంగాణతో సహా 8 రాష్ట్రాలు ఫసల్‌భీమా నుండి 2000 సంవత్సరంలోనే బయటకు వచ్చాయి అని పేర్కొన్నారు . దేశవ్యాప్తంగా 1361 మండీ (మార్కెట్‌లలో) 3 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు, అలాగే మొత్తం దేశంలో వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ 18 లక్షల కోట్లకు చేరి, కనీస మద్దతు ధరలు రైతులకు లభిస్తున్నట్లు బడ్జెట్‌లో చెప్పడం  సిగ్గుచేటని అన్నారు . కేంద్ర ప్రభుత్వం ముమ్మాటికి రైతులను భ్రమలకు గురిచేసే ప్రకటన మాత్రమే. 18 లక్షల కోట్ల వ్యాపారంలో కనీస మద్దతు ధర లభించక రైతులు ఏటా 4 లక్షల కోట్లకు నష్టపోతున్నట్లు ఆర్థిక వేత్తలు తెలియజేశారు అని పేర్కొన్నారు. నానో యూరియా ద్వారా ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌ ఆగిపోయిందని, నానో డిఏపిని తెస్తామని బడ్జెట్‌లో చెప్పారు. ఇప్పటికీ దేశానికి అవసరమైన ఎరువులలో 60 శాతం ఎరువులతోపాటు 100 శాతం పొటాష్‌ను ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం అని. డాలర్‌ విలువతో పోటీ పడి రూపాయి విలువ తగ్గడంతో ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒకవైపున ఎరువుల ధరలు పెరిగిపోతుండగా 2022 , 23లో రూ.2,54,841 కోట్లు సబ్సిడీ ఇవ్వగా, 2024`25 బడ్జెట్‌లో రూ.1,68,130 కోట్లకు తగ్గించారు. లక్ష కోట్లు తగ్గించి ఎరువులు అందుబాటులోకి తెచ్చామని కేంద్రం చెప్పడం హశ్యాస్పదం అని అన్నారు .80 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహార పథకాన్ని అమలు జరిపే  ప్రభుత్వం ఆహార ధాన్యాల ఉత్పత్తిని విస్తృతంగా పెంచాలి. కానీ, ఆహార సబ్సిడీల కొరత, ఉపాధిహామి పథకం కోతతో పాటు వ్యవసాయ ఎగుమతి ,దిగుమతుల వ్యాపారాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడం వల్ల ఉపకరణాల ధరలు పెరిగి వ్యవసాయోత్పత్తుల ధరల తగ్గిపోతున్నాయి అని అన్నారు . రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆదేశించినట్లు 18 శాతం పంట రుణాలు, 22 శాతం దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని అన్నారు.దేశాన్ని వ్యవసాయ దిగుమతులకు కేంద్రంగా తయారు చేస్తూ, వ్యవసాయోత్పత్తులపై కార్పొరేట్‌ సంస్థలకు ఆధిపత్యం కలిగే విధంగా నిధులు తగ్గిస్తున్నారు అని అన్నారు. గతంలో ఉపసంహరించుకున్న 3 నల్ల చట్టాలను మరో కోణంలో  అమలు జరపడాన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణమే రుణాల మాఫీతోపాటు కనీస మద్దతు ధరలను శాస్త్రీయంగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మిర్యాల భరత్ , సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు మండల కమిటీ సభ్యులు శ్రీను , వేముల లింగస్వామి , యాట యాదయ్య , వడ్లమూడి హనుమయ్య , మేడి రాములు తదితరులు ఉన్నారు.
Spread the love