యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సమూహం :అంగన్వాడీ కేంద్రాల సందర్శన

నవతెలంగాణ –  గాంధారి
గాంధారి మండలంలోని తిప్పారంతండాగొల్లాడి తండా,సోమవారం తండాలను యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సమూహం  అంగన్వాడీ కేంద్రాల సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా బాలింతలు మరియు 7 నెలల నుండి రెండు సంవత్సరాల పిల్లల ఆహారపు అలవాట్లను  తల్లుల నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. తల్లుల మరియు పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత గురించి సమూహంలో అడిగి తెలుసుకోవడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో ఒక పూట అందించే భోజనాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఎల్లారెడ్డి ప్రాజెక్టు అధికారి సరిత, యూనిట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ త్రవేష, ప్రోగ్రాం అసోసియేట్ పర్సన్స్ భవాని, మాధురి తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలోని పరిసరాలను రిజిస్టర్లను తనిఖీ చేశారు. తదనంతరం సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకురాలు వినోదిని, భారతి అంగన్వాడీ టీచర్లు శారద, ఆయాలు తల్లులు పాల్గొన్నారు.
Spread the love