– స్టాక్‌కార్ట్ కొత్త ప్లాన్ విడుదల
న్యూఢిల్లీ : ఇన్వెస్టర్లకు జీరో బ్రోకరేజ్ ట్రేడింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు డిస్కౌంట్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ అయిన స్టాక్‌కార్ట్ సీఈఓ ప్రణరు అగర్వాల్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్మార్ట్‌ట్రేడర్ ప్లాన్‌ను ప్రారంభించామన్నారు. ఇది సరసమైన ధరలకు వ్యాపారం చేయాలనుకునే క్రియాశీల వ్యాపారుల కోసం రూపొందించబడిందన్నారు. ఒక సంచలనాత్మక జీరో బ్రోకరేజ్ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఆఫర్ అని పేర్కొన్నారు. ఈ ప్లాన్‌లో నెలకు రూ.99, లేదా ఏడాదికి రూ.699 చెల్లించడం ద్వారా అపరిమిత లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు.