
కౌలాస్ లో సోమవారం ఊరడ మ్మా విగ్రహ ప్రతిస్థాపన ఘనంగా జరిగింది. వేద పండితులు అనంత జ్యోషి, మనోహర్ జ్యోషి, విశ్వనాధ్ జ్యోషి లు శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టపన చేశారు. గ్రామ నాయకులు అనిత సింగ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఊరడమ్మా (బొడ్రాయి)తో పాటు మహా లక్ష్మి, భూ లక్ష్మి, విరహలను ప్రతిష్టించారు. భక్తులకు అన్నదానం చేశారు. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి నైవేద్యలు సమర్పించారు. కార్యక్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.