USS Gerald R Ford:అమెరికా యుద్ధ వాహన నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా యుద్ధ వాహన నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ గురించి తాజాగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి వీలు అమెరికా యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే అతి పెద్ద వాహన నౌకను రంగంలోకి దించింది. హమాస్ ఉగ్రవాదులపై నిఘా వేయడంతోపాటు గాజాపై దాడులు చేసేలా తూర్పు మధ్యధరా సముద్రంలో మోహరించారు. ఇజ్రాయెల్ పక్షాన గాజాపై గర్జనకు యుద్ధరంగంలోకి దిగి యూఎస్ అతిపెద్ద విమాన వాహక నౌక అత్యంత అధునాతనమైనది. ఈ యూఎస్ యుద్ధ నౌకకు ప్రపంచంలోని ఏ సైనిక బలగాన్నైనా అంతమొందించే సామర్ధ్యం ఉంది. అతి పెద్ద యుద్ధనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అతి పెద్ద యుద్ధ నౌక 337 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పు, 76 మీటర్ల ఎత్తు ఉన్న ఈ యూఎస్ నౌక ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే అత్యంత ఎత్తులో ఉంటుంది. ఈ నౌక బరువకు 1,00,000 టన్నులుంటుంది. హౌరా వంతెన నిర్మాణం కోసం ఉపయోగించిన ఉక్కు బరువుకు దాదాపు నాలుగు రెట్లు అదనంగా ఈ నౌక బరువు ఉంటుంది. గంభీరంగా కనిపస్తున్న ఈ యూఎస్ యుద్ధ వాహన నౌక శత్రు సేనలను మట్టుబెడుతోంది. భారతదేశంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌయక 262 మీటర్ల పొడవు,45 వేల టన్నుల బరువు ఉంటుంది. ప్రపంపంలోనే అతి పెద్ద యూఎస్ నౌక అత్యంత భయంకరమైనది. యూఎస్ యుద్ధ వాహక నౌక 90 విమానాలను ,4,500 మంది కంటే ఎక్కువ మంది సిబ్బందిని తీసుకువెళుతోంది. ఈ నౌక ఎఫ్-35, ఎఫ్ఏ-18 సూపర్ హార్నెట్, ఈ-2డి అడ్వాన్స్‌డ్ హాకీ, ఈఏ-18 జి గ్రోలర్ ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, ఎంహెచ్ -60 ఆర్ ఎస్ హెలికాప్టర్లతో సహా 90 విమానాలకు మద్ధతు ఇస్తోంది. ఈ నౌకలో ఓడను నడిపేవారు, ఎయిర్ వింగ్ విభాగం కమాండర్లు ఉంటారు.  ఐఎన్ఎస్ విక్రాంత్ 36 విమానాలను నడుపుతోంది. అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కంటే రెట్టింపు సంఖ్యలో విమానాలను నడిపేందుకు యూఎస్ యుద్ధ నౌక ఉపకరించనుంది. అత్యంత చురుకుగా ఉండే ఈ యూఎస్ నౌక గంటకు 56 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడుస్తోంది. యూఎస్ పాత నౌకల కంటే ఎక్కవు విద్యుత్ సామర్ధ్యాన్ని అందిస్తోంది. ఏ1బి న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్ ను ఉత్తత్తి చేస్తోంది. నౌకలోని రియాక్టర్ల జీవిత కాలం 25 సంవత్సరాలు. ప్రమాదకర ఆయుధాలు మోసుకెళ్లే నౌక ఈ యూఎస్ యుద్ధ నౌక ప్రమాదకర ఆయుధాలను మోసుకెళుతోంది. ఆన్ బోర్డ్ రక్షణ వ్యవస్థతో క్యారియర్ స్ర్టైక్ గూపు డిఫెన్సివ్ కవరుతో ప్రయాణిస్తోంది. 2017లో సేవలందించిన ఈ విమాన వాహక నౌకకు యూఎస్ మాజీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ పేరు పెట్టారు. యుద్ధరంగంలో అతి వీర భయంకరంగా పోరాడే ఈ యుద్ధ నౌక ప్రస్థుతం ఇజ్రాయెల్ పక్షాన గాజాపై గర్జిస్తోంది.

Spread the love