చౌటుప్పల్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వి.అశోక్ రెడ్డి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వి.అశోక్ రెడ్డి పదవి బాధ్యతలు ఆదివారం స్వీకరించారు. చౌటుప్పల్ టౌన్ గా సర్కిల్ ఇన్స్పెక్టర్ సెగ్గం దేవేందర్ రాచకొండ షీ టీం కి బదిలీ అయ్యారు.ఎస్ఓటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుండి చౌటుప్పల్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్.దేవేందర్ నుండి చార్జి తీసుకున్నారు.వి.అశోక్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడటంలో నా వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు.చౌటుప్పల్ మండల ప్రజలు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.
Spread the love