వైష్ణవి మృతిపై  సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరపాలి

– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
– వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించిన ఐద్వా, ఎస్ఎఫ్ఐ బృందం
నవతెలంగాణ – సూర్యాపేట
ఇమాంపేట గురుకుల విద్యార్థిని వైష్ణవి మృతి పై  సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మృతి చెందిన వైష్ణవి కుటుంబానికి న్యాయం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి  డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో  మృతి చెందిన గురుకుల కళాశాల విద్యార్థిని దగ్గుబాటి వైష్ణవి కుటుంబాన్ని ఐద్వా, ఎస్ఎఫ్ఐ   బృందం ల ఆధ్వర్యంలో పరామర్శించి,వైష్ణవి మృతికి సంబంధించిన వివరాలను ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గురుకుల కళాశాలలో వైష్ణవి మృతి చెందిన విశయంలొ అనేక  అనుమానాలు ఉన్నాయన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ హాస్టల్ సిబ్బంది మీ అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందని తల్లిదండ్రులకు చెబితే విద్యార్థిని శరీరంపై గాయాలు ఎలా అయ్యాయని ఆమె ప్రశ్నించారు.వైష్ణవి చనిపోయాక తల్లిదండ్రులు, పోలీస్ లు రాకముందే డెడ్ బాడీ ని ఆసుపత్రి కి తీసుకెళ్లడం అనుమానాలకు దారి తీస్తుందన్నారు.విద్యార్థిని చదువుకున్న సమయంలో ఉన్న రూముని గురుకుల కళాశాలను సందర్శించే విధంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చొరవ తీసుకొవలన్నారు. వైష్ణవి కుటుంబంలో ఒకరికి  ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని స్పష్టమైన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో గురుకుల విద్యార్థిని భువనగిరిలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల మరణాలపై సమగ్ర వివరాలు తెలియాలంటే సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. జిల్లా ఎస్పీ ,జిల్లా కలెక్టర్ మృతి చెందిన వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించకపోవడం సరికాదన్నారు. ధర్నా ఫలితంగా ఇచ్చిన హామీ అమలు కోసం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షం లో  రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంలు నిర్వహిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, సిపిఐఎం పట్టణ కార్యదర్శి వల్లపుదాస్ సాయికుమార్, ఐద్వ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మద్దెల జ్యోతి, కోట సృజన,మామిడి సుందరయ్య, అక్కినపల్లి వినయ్, నాగరాజు, రాణమ్మ శశిరేఖ, భిక్షమమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Spread the love