వజ్రఖండి నూతన ఉపాద్యాయులను సన్మానించిన మాజీ సర్పంచ్..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని వజ్రఖండి గ్రామములోని ఎంపిపీఎస్ పాఛశాలలలో నూతనంగా పలవురు ఉపాద్యాయులను ప్రభూత్వం నియమించడంతో  విద్యార్థుల తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేసారు. శుక్రవారం నాడు పాఠశాలలో గ్రామ మాజీ సర్పంచ్ సంజీవ్ పాటీల్  అధ్వర్యంలో గ్రామస్తులు కొత్తగా వచ్చిన ఉపాద్యాయులను సన్మానించారు. ప్రస్తుతం పాఠశాల ఉపాద్యాయుల కోరత సమస్య కొంత వరకు లేకుండా పోయిందని , ఇక విద్యాబోదన  పటిష్టం చేసి మంచి భవిషత్ తరాలకు ఉపయేాగపడే  విధంగా విద్యార్థులు తయారు చేస్తామని హెచ్ఎమ్ సాయులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తో పాటు పాఠశాల ఉపాద్యాయ బృందం, గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love