
నవతెలంగాణ – కామారెడ్డి
బీసీ సంఘంనికి వట్లంగారి దత్తుకు ఎలాంటి సంబంధం లేదని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడ మండల కేంద్రానికి చెందిన వట్లంగారి దత్తు అనే వ్యక్తి బీసీ సంఘం పేరుతో జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలు, హాస్టల్ ఇతర సంస్థల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలిసిందని, అతను గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ బీసీ సంఘం కార్యక్రమంలో పాల్గొనలేదని తెలిపారు.కేవలం వసూల్లే లక్ష్యంగా తిరుగుతున్న దత్తు కి బీసీ సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎక్కడైనా బీసీ సంఘం పెరు చెప్పి వసూళ్లకు పాల్పడితే తమకి సమాచారం ఇవ్వాలని,లేదా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయాలని కోరుతున్నాం అన్నారు. త్వరలోనే బాన్సువాడ లో బీసీ విద్యార్థి, యువజన, సంక్షేమ సంఘాల కొత్త కమిటీలు వేస్తున్నామని బీసీ నాయకులు ఎవరైన ఉంటే మమ్మల్ని సంప్రదించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డా.నాగరాజ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు సాప శివరాములు, విద్యార్థి సంఘం అధ్యక్షులు నీల నాగరాజు,ప్రధాన కార్యదర్శి దయాకర్, ఉపాధ్యక్షులు నిశాంత్ గౌడ్, సాయిలు,సంజీవ్,రమాకాంత్,శివ తదితరులు పాల్గొన్నారు.