Thursday, August 20, 2026
E-PAPER
Homeబీజినెస్భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించిన వాయు

భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించిన వాయు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉన్నత ఆశయాలున్న తయారీదారులు , అభివృద్ధి చెందుతున్న వ్యాపార సంస్థల అవసరాల కోసం రూపొందించిన కొత్త ఎయిర్ కంప్రెసర్ బ్రాండ్ అయిన వాయు(VAYU), విభిన్న తయారీ అవసరాలకు అనుగుణంగా నమ్మకమైన పనితీరు, నిర్వహణ సౌలభ్యం, సమర్థవంతమైన యాజమాన్య నిర్వహణను అందించడానికి రూపొందించిన కంప్రెస్డ్ ఎయిర్ సొల్యూషన్స్ పోర్ట్‌ఫోలియోతో భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది.

 భారతదేశ పారిశ్రామిక వృద్ధి కథలో సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఈ ప్రారంభం జరిగింది. ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం, ఎంఎస్ఎంఈలు భారతదేశ తయారీ రంగ ఉత్పత్తిలో సుమారు 35.4%, దేశీయ ఎగుమతులలో 48.58% మరియు జిడిపిలో 31.1% వాటాను అందిస్తున్నాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం యొక్క పరిమాణం, ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది.

 భారతదేశంలో అభివృద్ధి చేయబడి, భారతీయ తయారీ వ్యాపారాల వాస్తవ కార్యాచరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన వాయు, ఈ వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ యొక్క ఆశయం , సామర్థ్యంపై ఉన్న బలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ అభివృద్ధి చెందుతున్న క్రమంలో వారికి అండగా నిలిచేలా ఈ బ్రాండ్‌ను రూపొందించారు. ఇది వాస్తవ ప్రపంచ కార్యాచరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన కంప్రెస్డ్ ఎయిర్ పరిష్కారాలు, సులభమైన నిర్వహణ , వేగవంతమైన సేవా మద్దతును అందిస్తుంది.

 ఎల్గి ఎక్విప్‌మెంట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అన్వర్ జయ్ వరదరాజ్ మాట్లాడుతూ, “భారతదేశ తయారీ రంగ ప్రస్థానం అనేది అంతిమంగా దాని వ్యవస్థాపకుల కథే. ఇది నిరంతరం పెట్టుబడులు పెడుతూ, సామర్థ్యాలను పెంపొందించుకుంటూ, ఉపాధిని సృష్టిస్తూ, దేశ వృద్ధికి దోహదపడే వ్యాపారాల కథ. మేము దశాబ్దాలుగా ఈ విభాగానికి సేవలందిస్తున్నాము. వారి వ్యాపారాలు విస్తరించే కొద్దీ వారి అవసరాలు కూడా మారడాన్ని చూశాము. ఆ ప్రయాణంలో వాయు తదుపరి అడుగుగా నిలుస్తోంది. ఇది భారతీయ తయారీ రంగ వాస్తవ పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా భారతదేశంలోనే రూపొందించబడి తయారు చేసి నిర్మించబడిన నమ్మకమైన స్క్రూ కంప్రెసర్ టెక్నాలజీని విస్తృత శ్రేణి వ్యాపారాలకు అందిస్తుంది. భారతదేశంలోని ఈ తయారీదారులతో కలిసి ఎదగడం , కాలక్రమేణా వాయును ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల చెంతకు తీసుకెళ్లడం మా లక్ష్యం ” అని అన్నారు. 

ప్రారంభంలో, వాయు 5-45 kW శ్రేణి ఎయిర్ కంప్రెసర్‌లను అందిస్తోంది. ఇవి స్థిర-వేగం మరియు వేరియబుల్-స్పీడ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉండటంతో పాటుగా 7 నుండి 12.5 బార్ వరకు ఆపరేటింగ్ ప్రెషర్‌ల కోసం రూపొందించబడ్డాయి. ఈ పోర్ట్‌ఫోలియోకు అనేక రకాల యాక్సెసరీలు, అసలైన విడి భాగాలు, సమగ్ర వారంటీ కవరేజ్ మరియు దేశవ్యాప్త సర్వీస్ సపోర్ట్ మద్దతుగా ఉన్నాయి.  

 భారతదేశపు తయారీ రంగ పారిశ్రామికవేత్తలతో కలిసి ఎదుగుతూ: దశాబ్దాలుగా, ఎల్గి (ELGi) తమ రెసిప్రొకేటింగ్ కంప్రెసర్ పోర్ట్‌ఫోలియో ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న తయారీ రంగ వ్యాపార సంస్థలకు సేవలు అందిస్తోంది. వారి వ్యాపారాలు మరియు కంప్రెస్డ్ ఎయిర్ అవసరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ, కస్టమర్లతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకుంది. ఈ భాగస్వామ్యంలో వాయు తదుపరి అడుగును సూచిస్తుంది. ఇది తమ కంప్రెస్డ్ ఎయిర్ సామర్థ్యాలను అప్‌గ్రేడ్ చేయాలనుకునే విస్తృత శ్రేణి తయారీ వ్యాపారాలకు స్క్రూ కంప్రెసర్ టెక్నాలజీని అందిస్తుంది. తయారీదారులు ఉత్పత్తిని విస్తరిస్తూ, కొత్త టెక్నాలజీలను స్వీకరిస్తున్నప్పుడు, కంప్రెస్డ్ ఎయిర్ వంటి కీలకమైన వినియోగ వస్తువుల నుండి వారి అంచనాలు కూడా మారుతున్నాయి. ఈ పరివర్తనను దృష్టిలో ఉంచుకుని వాయు అభివృద్ధి చేయబడింది. ఇది అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి , కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అందిస్తుంది.

 తయారీ రంగ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది: తయారీ రంగంలోని వివిధ కార్యకలాపాలలో కంప్రెస్డ్ ఎయిర్ ఒక కీలకమైన వినియోగ వస్తువుగా ఉంటుంది. ఇక్కడ పరికరాల విశ్వసనీయత , నిరంతరాయత ఉత్పాదకత, కస్టమర్ నిబద్ధతలు మరియు వ్యాపార పనితీరును నేరుగా ప్రభావితం చేస్తాయి. వాయు, ఒక సాధారణ అవగాహన ఆధారంగా నిర్మించబడింది: తయారీదారులకు కంప్రెస్డ్ ఎయిర్ కంటే ఎక్కువ అవసరం. షిఫ్ట్ తర్వాత షిఫ్ట్, ఉత్పత్తి సజావుగా కొనసాగగలదనే నమ్మకం వారికి కావాలి. ఒకే ఒక్క ప్రత్యేక లక్షణంపై ఆధారపడకుండా, వాయు సంస్థ నమ్మకమైన పరికరాలు, సులభమైన నిర్వహణ మరియు కార్యకలాపాలు, అలాగే యాజమాన్య ప్రయాణం అంతటా అందుబాటులో ఉండే మద్దతును అందిస్తుంది.

 ఎల్గి ఎక్విప్‌మెంట్స్, ఇండియా, సౌత్ ఏషియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ & సౌత్ ఈస్ట్ ఏషియా (ISAAME & SEA) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ – భావేష్ కరియా మాట్లాడుతూ, “ తయారీ రంగంలోని పారిశ్రామికవేత్తకు, కంప్రెస్డ్ ఎయిర్ కేవలం ఒక వినియోగ వస్తువు మాత్రమే కాదు; ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుందనే, ఇచ్చిన హామీలు నెరవేరతాయనే, వ్యాపారం వృద్ధి చెందుతుందనే నమ్మకానికి ఇది కీలకం. ఈ రోజువారీ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని వాయు అభివృద్ధి చేయబడింది. నమ్మకమైన పనితీరు, సులభమైన నిర్వహణ మరియు అందుబాటులో ఉండే రీతిలో సేవా మద్దతును అందించడంపై మా దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ కారణం చేత వినియోగదారులు కంప్రెస్డ్ ఎయిర్ గురించి ఆందోళన చెందకుండా,  తమ వ్యాపారాలను నిర్మించుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చించగలరు” అని అన్నారు. 

 ఆటోమోటివ్ మరియు ఆటో విడిభాగాలు, జనరల్ ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్ మరియు మెటల్  వర్కింగ్, టెక్స్‌టైల్స్, ఆహారం,పానీయాలు, ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, కలప మరియు ఫర్నిచర్, మరియు ఇతర తయారీ అవసరాలతో సహా కీలక తయారీ రంగాలలో కంప్రెస్డ్ ఎయిర్ అవసరాలను తీర్చడానికి వాయు పరిష్కారాలు రూపొందించబడ్డాయి.

 విభిన్న తయారీరంగ అవసరాల కోసం 5-45 kW పోర్ట్‌ఫోలియో: వాయు పోర్ట్‌ఫోలియో 5-45 kW పరిధిలో విస్తరించి ఉంది, ఇది వివిధ రకాల ఉత్పత్తి అవసరాలు , నిర్వహణ పరిస్థితులకు అనువైన కంప్రెస్డ్ ఎయిర్ పరిష్కారాలను వ్యాపారాలకు అందిస్తుంది. వినియోగదారులు 7 నుండి 12.5 బార్ల వరకు ఉండే ఆపరేటింగ్ ప్రెషర్‌లతో, ఫిక్స్‌డ్-స్పీడ్ మరియు వేరియబుల్-స్పీడ్ కాన్ఫిగరేషన్‌ల మధ్య ఎంచుకోవచ్చు. ఇది వారి నిర్దిష్ట అప్లికేషన్ మరియు కంప్రెస్డ్ ఎయిర్ డిమాండ్‌కు అనుగుణంగా పరిష్కారాలను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ కంప్రెసర్ శ్రేణికి సహాయక యాక్సెసరీలు మరియు అసలైన విడి భాగాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి వినియోగదారులకు పరికరాల యాజమాన్యం మరియు నిర్వహణను సులభతరం చేయడంలో సహాయపడతాయి.

 యంత్రాలకు మించిన యాజమాన్య హామీ: ఒక కొత్త బ్రాండ్‌గా, ఉత్పత్తి పనితీరు మరియు యాజమాన్య అనుభవం రెండింటి ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకోవాలని వాయు గుర్తించింది. తమ కంప్రెసర్‌లకు అత్యుత్తమ వారంటీ కవరేజ్ మద్దతును వాయు ఇస్తుంది, దీనికి తోడు పరికరాల జీవితకాలం అంతటా దేశవ్యాప్త సేవా మద్దతు అందించటంతో పాటుగా అసలైన విడి భాగాలు, యాక్సెసరీల ను సైతం అందిస్తుంది. ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో, వారంటీ కవరేజ్ మరియు సర్వీస్ ఎకోసిస్టమ్ అన్నీ కలిసి, తయారీ వ్యాపారాలకు వారి కంప్రెస్డ్ ఎయిర్ కార్యకలాపాలపై మరింత విశ్వాసాన్ని ఇచ్చేలా రూపొందించబడ్డాయి.

భారతదేశంలో తయారీ. ప్రపంచానికి సిద్ధం: వాస్తవ తయారీ పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల రోజువారీ ఆపరేటింగ్ అవసరాలపై స్పష్టమైన అవగాహనతో వాయు భారతదేశంలో అభివృద్ధి చేయబడింది. భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఇంజనీరింగ్, తయారీ మరియు సేవా సామర్థ్యాలను సమవ్యయం చేసుకుంటూ,  ఈ బ్రాండ్ తొలుత భారతీయ తయారీదారులకు సేవలు అందించడంపై దృష్టి సారించనుంది, అనంతరం,  అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది.

వాయు ఆలోచనా విధానానికి కేంద్రబిందువుగా ఒక స్పష్టమైన నమ్మకం ఉంది: నమ్మదగిన పరికరాలు పనిని సులభతరం చేయాలి, నిర్వహణపరమైన ఆందోళనలను తగ్గించాలి, తయారీదారులు తమ ఉత్పత్తి మరియు వ్యాపార వృద్ధిపై దృష్టి సారించేలా చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -