ఎమ్మేల్యేను సన్మానించిన వీడీసీ సభ్యులు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ని జక్రాన్ పల్లి మండలం తోర్లికొండ  గ్రామానికి చెందిన వీడీసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానంచేశారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కి వివరించారు. ఎమ్మెల్యే  వెంటనే స్పందించి, వారి  సమస్యలను బడ్జెట్ వచ్చిన వెంటనే అమలు చేస్తానని హామీ ఇచ్చినట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, తెల్లన్న, రవి, జై గంగారం ,వినోద్ వి డి సి చైర్మన్ వెంకన్న మహిపాల్ లిoగారెడ్డి శేఖర్ గౌడ్, కుమార్, డాక్టర్ అరుణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు .
Spread the love