వీరబ్రహ్మేంద్రస్వామి.. కాలజ్ఞాని

నవతెలంగాణ పెద్దవంగర: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాని అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుంపల సమ్మయ్య, రాపాక కవిరాజు అన్నారు. శనివారం ఉప్పెరగూడెం గ్రామంలోని శ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమంలో బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో ఏం జరుగబోతుందో భవిష్యత్తును వంద తరాల ముందే చెప్పి సమాజాన్ని అప్రమత్తం చేసిన మహనీయులు వీర బ్రహ్మేంద్ర స్వామి అని అన్నారు. కాల జ్ఞానియే కాకుండా హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టోజు నవమోహనాచారి, రమేష్, విష్ణువర్ధనా చారి, ఆలయ పూజారి బాబు చారి, ఉపేంద్ర చారి, దుంపల బిక్షం తదితరులు పాల్గొన్నారు.
Spread the love