Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల ఎక్సైజ్‌ స్టేషన్‌లో వాహనాల వేలం

పరకాల ఎక్సైజ్‌ స్టేషన్‌లో వాహనాల వేలం

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో వివిధ నేరాలకు సంబంధించి పట్టుబడిన వాహనాలను ఈ నెల 25న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు ఎక్సైజ్‌ సీఐ పి. తాతాజీ తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి, వరంగల్‌ రూరల్‌ వారి ఆదేశాల మేరకు పరకాల ఎక్సైజ్‌ స్టేషన్‌లో ఈ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆయా వాహనాల అప్‌సెట్‌ ధరలో 50 శాతం మొత్తాన్ని డిపాజిట్‌గా చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వాహనాల వేలానికి ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయానికి పరకాల ఎక్సైజ్‌ స్టేషన్‌కు హాజరుకావాలని సీఐ తాతాజీ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -