
తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామంలో ఆదివారం గీత కార్మికుడు పాలకుర్తి వెంకన్న గౌడ్ గీత కార్మిక వృత్తితో జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల తాటి చెట్టు నుండి జారీ కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం గ్రామానికి చేరుకొని వెంకన్న కుటుంబాన్ని పరామర్శించి రూ.15000 రూ ఆర్థిక సహాయాన్ని వెంకన్న భార్య పాలకుర్తి పద్మ, కూతురు మౌనికకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పాలకుర్తి వీరయ్య పెద్దగౌడ్, పాలకుర్తి వెంకన్న,మామిడి యాదగిరి, మెంచూ అశోక్, పులిపంపుల భద్రయ్య, మద్దెల సోమయ్య, మేంచు వెంకన్న, కాసగాని శ్రీను, పాలకుర్తి సోమయ్య, పాలకుర్తి ఉప్పలయ్య, పాలకుర్తి రవి, నామాల గురుమూర్తి, మెంచు రమేష్, చిరగాని వీరయ్య, పాలకుర్తి కనకయ్య, రెడ్డి మల్ల సైదులు, పాలకుర్తి ఎల్లాగౌడ్, కసగాని సోమేశ్, పాలకుర్తి పవన్ కుమార్, పాలకుర్తి సైదులు తదితరులు పాల్గొన్నారు.