చాలా సహజంగా ఉండే యాక్షన్‌

Very natural actionబాలకష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. దసరా కానుకగా ఈనెల 19న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రానికి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ విలేకరులతో మాట్లాడుతూ, ‘దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ కథ అనుకున్నప్పుడే బాలకష్ణని కొత్తగా చూపించాలని అనుకున్నారు. బాలకష్ణ స్పీడ్‌ని పట్టుకొని హాలీవుడ్‌ స్టైల్‌లో చాలా సహజంగా యాక్షన్‌ని డిజైన్‌ చేశాను. ఇందులో ఎక్కువ కట్స్‌ని ప్లాన్‌ చేసుకోలేదు. స్లో మోషన్‌ షాట్స్‌ని తగ్గించేశాం. బాలకష్ణ ప్రతి సినిమాలో ఒక ప్రత్యేక ఆయుధం ఉంటుంది. ఇందులో ఉన్న ఆయుధం ఆలోచన డైరెక్టర్‌ అనిల్‌ గారిదే. కథ, పాత్ర రాసుకున్నపుడే ఆ వెపన్‌ గురించి ఉంది. ఆయన ఫ్యాక్టరీలో పని చేస్తారు. దీని కోసం చాలా అద్భుతమైన సెట్‌ చేశారు. అక్కడ ఉన్న వాటితోనే ఒక ఆయుధం తయారు చేస్తారు. ఆ ఎపిసోడ్‌ టెర్రిఫిక్‌గా వచ్చింది. ఇందులో ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీక్వెన్స్‌ నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటుంది. బాలకష్ణతో ‘పైసా వసూల్‌, వీరసింహారెడ్డి’ చిత్రాలు చేశాను. ఆయన బాడీ లాంగ్వేజ్‌ మీద పట్టు దొరికింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా క్రిస్ప్‌గా ఉంటాయి.. అదే సమయంలో చాలా ఇంపాక్ట్‌ ఫుల్‌గానూ ఉంటాయి. బాలయ్యతో పాటు అర్జున్‌ రాంపాల్‌తో ఇంటెన్స్‌ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ ఉంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్‌ సీన్‌ ..టగ్‌ ఆఫ్‌ వార్‌గా ఉంటుంది. షైన్‌ స్క్రీన్స్‌ నిర్మాతలు హరీష్‌, సాహు మాపై పూర్తి నమ్మకం ఉంచారు. ఎక్కడా రాజీపడలేదు. ప్రతి యాక్షన్‌కి సెట్‌ వేశాం. ఏడు అద్భుతమైన సెట్స్‌, దాదాపు ఎనిమిది యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అన్నీ అద్భుతంగా వచ్చాయి’ అని అన్నారు.

Spread the love