సంగారం లో పశువైద్య శిభిరం

నవతెలంగాణ -పెద్దవూర
శీతాకాలంలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మండలం లోని సంగారం గ్రామంలో బుధవారం మండలం పశు  వైద్యఆధికారులురైతులకుఅవగాహన సదస్సు ఉచిత పశువైద్య శిభిరం ను నిర్వహించారు. ఈసందర్బంగా  మండల పశువైద్యాధికారులు డాక్టర్ చంద్రబాబు, సాయికార్తీక్ మాట్లాడుతూ ఎదకి రాని పశువుల కు సరిగా పోషక విలువలు ఉన్న మేత వేయడం వలన మరియు నట్టల మందులు కట్టుకు రావడానికి ఉపయోగపడే మందులు వేపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని కూడా నిర్వహించి 42 పశువులకు ఖనిజ లవణ మిశ్రన్ని, మందులను ఉచితంగా అందజేశారు. ఈ శిబిరంలో లంపిస్కిన్ వ్యాధి టీకాలు, గర్భ కోశ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గోపాల మిత్రలు  గాలి లింగారెడ్డి, మధు, పాడిరైతులు, రైతుభరోసా కేంద్రం, సిబ్బింది తదితరులు పాల్గొన్నారు.
Spread the love