పత్తలేని పశువైద్యం


– పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఎప్పుడూ తాళం ఉంటున్న వైనం

– సమయ పాలన పాటించని ఏడీ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి : పాడి రైతులు
నవతెలంగాణ-తాండూరు
పల్లెల్లో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయం తోపాటు పాడిపరిశ్రమను జీవనాధారం గ్రామాల్లో కూలీ పనులు చేసుకొని రైతులు, కూలీలు పశు పోషణతో కుటుంబాలను వెల్లదీస్తున్నారు. పశుపోషణ గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తాండూరు నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో రైతులు అధిక శాతం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలకు పశుపోషణపై ముందు చూపులేకపోవడంతో గ్రామాల్లో రోజు రోజుకు పాడి పరిశ్రమ తగ్గిపోతుంది. ఒక వైపు అంటురోగాలతో పశువులు మృత్యువాతకు గురవుతుంటే దానికి తోడు అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వాలు పశుపోషణను కాపాడలేకపోతున్నాయి.
పేరుకే విధుల నిర్వహణ
పశుసంవర్ధక శాఖ పేరుకే విధులు నిర్వహిస్తున్నారని, కానీ ఏ ఒక్క రైతుకు న్యాయం చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాండూరు నియోజక వర్గంలో పశువుల వివరాలు అధికారుల దగ్గర లేవంటే వారి పని తీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాండూరు నియోజకవర్గ పరిధిలోని 8 పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. అందులో 6గురు పశువైద్య అధికారులు పనిచేస్తున్నారు. తాండూరు మండల పరిధిలో ముగ్గురు పశువైద్య అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్‌, గొట్టిగఖర్దు,రెండు పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాండూరు డివిజన్‌ కేంద్రంలో పశుసంవర్ధక శాఖ కార్యాలయం రోజు తాళంతోనే దర్శనం ఇస్తుంది. ఇందులో పనిచేసే పశువైద్య అధికారులు సిబ్బంది వారంలో రెండు రోజులు మాత్రమే వస్తున్నట్టు సమాచారం. అది కూడా మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే ఉండి హైదరాబాద్‌కు వెళ్లె ట్రైన్‌కు వెళ్లిపోతున్నారని సమాచారం. డివిజన్‌ కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఉన్నా పశువైద్య శాలల గురించి చెప్పనక్కర్లేదు. అధికారులు కార్యాలయాల్లోనే ఉండకపోతే రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని పలువురు విమర్శిస్తున్నారు. పశుసంవర్ధక శాఖలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా స్థానిక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ తమ తమ విధులకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఆటకెక్కిన పథకాలు
పశుసంవర్ధక శాఖ రైతులను ఆదుకోవడం కోసం గతంలో ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆ శాఖలో రైతులకు జరుగుతున్న మేలు ఏమిటో ఎవరికి తెలియడం లేదు. తెలుసుకుందామంటే అధికారులు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. గర్భధారణ ద్వారా మేలు జాతీ దూడాలను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న సందర్భాలు కనిపించడం లేదు. పశుసంవర్ధక శాఖలో ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలపై అవగాహన ఉండటం లేదు. అవగాహన కల్పించాల్సిన అధికారులే గ్రామాల వైపు చూడనప్పుడు రైతులకు ఎవ్వరిని అడిగి తెలుసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
అధికారుల సమయ పాలన ఏది
తాండూరు నియోజక వర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పశువైద్య అధికారులు హైదరాబాద్‌ నుంచి వచ్చి వెళ్తుంటారు. వారికి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మధ్యాహ్నం లోపే వెళ్లిపోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. దీంతో పశువులకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సమయానికి కార్యాలయానికి సైతం రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాండూరు డివిజన్‌ కేంద్రంలో ఉన్న పశువైద్య అధికారి డివిజన్‌ ఆపీసర్‌ 10 గంటలకు వచ్చి వెళ్తున్నారు తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలాలు, డివిజన్‌ కేంద్రంలో పశువైద్య అధికారులు సక్రమంగా సమయ పాలన పాటించి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Spread the love