Friday, May 22, 2026
E-PAPER
Homeజాతీయంవిజయ్ కేబినెట్‌లోకి ఐయుఎంఎల్, వీసీకే

విజయ్ కేబినెట్‌లోకి ఐయుఎంఎల్, వీసీకే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్ లోకి ఐయుఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలను తీసుకున్నారు. పాపనాశం ఎమ్మెల్యే ఎ.ఎం.షాజహాన్, తిండివనం ఎమ్మెల్యే వన్నీ అరసులతో గవర్నర్ అర్లేకర్ శుక్రవారం లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. షాజహాన్ కు మైనారిటీ సంక్షేమ, వక్ఫ్ బోర్డు శాఖను కేటాయించగా, వన్నీ అరసుకి సామాజిక న్యాయం (ఆది ద్రావిడ సంక్షేమం, కొండ జాతుల సంక్షేమం) శాఖను కేటాయించారు. వీరిద్దరి చేరికతో మంత్రుల సంఖ్య 35కి పెరిగింది. రాజ్యాంగం ప్రకారం అనుమతించిన గరిష్ట మంత్రుల పరిమితి ఇదే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -