2బీ.హెచ్.కే ఇంటిని స్వాధీనం చేసుకున్న గ్రామస్తులు

– ఇంటి నుంచి పంపించిన పోలీసులు
–  గదలకు తాళం వేసిన రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ – భిక్కనూర్
గత రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో 2 బిహెచ్కె ఇంటీని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించి డబుల్ బెడ్రూంలు అందజేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో విసిగి చెందిన గ్రామస్తులు మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రామ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇంటిని రాత్రికి రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఎవరికివారు వారికి నచ్చిన గదిని తీసుకొని వంట సామాగ్రి తో సహా గదులలో ఏర్పాటు చేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని పాలు పొంగించుకున్నారు. విషయం తెలుసుకున్న బస్వాపూర్, సిద్ధ రామేశ్వర నగర్ గ్రామస్తులు తమరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలని వెళ్లి చూసేసరికి నచ్చిన వారు నచ్చిన గదికి తాళం వేసి ఉన్న దాన్ని చూసి అవాక్కై శుక్రవారం పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కాళీ చేసి వెళ్లిపోవాలని, ఖాళీ చేయకుంటే కేసులు నమోదు చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగమేఘాల మీద గదులలోకి దూరిన గ్రామస్తులు గదులను ఖాళీ చేసి తిరిగి ఇంటికి వెళ్లి పోయారు. అనంతరం ఎమ్మార్వో శివ ప్రసాద్ మాట్లాడుతూ అర్హులను గుర్తించి ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ చేయడం జరుగుతుందని, అంతవరకు గ్రామస్తులు సహనంతో ఉండాలని, గొడవలకు అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులకు రెవెన్యూ అధికారులకు సహకరించాలని తెలిపారు.
Spread the love