పోలింగ్ కేంద్రాల్లో బాలల హక్కులకు భంగం

– విద్యార్థులను వాలంటీర్లుగా మార్చిన వైనం
– మండుటెండలో, ఉక్కపోతల్లో విద్యార్థుల పాట్లు
– సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి : ప్రజలు
నవతెలంగాణ – రాయపర్తి
దేశ భవిష్యత్తును నిర్దేశించే లోక్ సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో అధికారుల అత్యుత్సాహంతో బాలల హక్కులకు భంగం వాటిల్లింది. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తును మార్చే పౌరులు అని ఊదరగొట్టే ప్రసంగాలు ఇచ్చే అధికారులే లోక్ సభ ఎన్నికల సాక్షిగా విద్యార్థులను ఎన్నికల వాలంటీర్లుగా మార్చి రోజు మొత్తం పోలింగ్ కేంద్రాల్లో మండుటేల్లో ఉక్కపోతల్లో నిలబెట్టారు. 9వ తరగతి విద్యార్థులకు పోలింగ్ వాలంటీర్ల టీ షార్టులు వేసి టోపీలు పెట్టించి పని మనుషుల్లా వాడుకోవడం శోచనీయం. మండలంలో 52 పోలింగ్ కేంద్రాల్లో విద్యార్థులను వాలంటీర్లుగా ఉపయోగించుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులను వాలంటీర్లుగా మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Spread the love