– ముధోల్ సీఐ మల్లేష్
నవతెలంగాణ-ముధోల్
ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముధోల్ సీఐ మల్లేష్ అన్నారు. ముధోల్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేవలం ప్రాథమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి వైద్యం అందిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. గ్రామాలలో ప్రాథమిక వైద్యం పేరుతో బోర్డులు పెడుతూ ఎటువంటి అర్హత లేకుండా వైద్యం నిర్వహించకూడదన్నారు. లింగ నిర్ధారణ, మైనర్, మేజర్ మహిళలకు అబార్షన్, లాంటి చేయడం నేరమని అన్నారు. రోగులకు ఇంజక్షన్లు, మందులు ఇవ్వరాదని సూచించారు. మందులు ఇచ్చి వారి ప్రాణాల మీదకు తేవడం కూడా నేరమని పేర్కొన్నారు. రోగులకు ఇతర జిల్లాలోని ఎంబీబీఎస్ డాక్టర్లకు రెఫర్ లెటర్లతో వారికి ఇవ్వకూడదని, ప్రత్యక్షంగా రోగులను వేరే ఆస్పత్రికి తీసుకవెళ్లి బాదితుల నుంచి పరోక్షంగా కమీషన్‌లు తీసుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చిందని చెప్పారు. రోగులు ఇష్టం వచ్చిన దగ్గర అనుమతి కలిగిన వైద్యుల వద్ద వారు వైద్యం పొందాలను కోరారు. నిబంధనలు పాటించని ఆర్‌ఎంపీ, పీఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పై సాయికిరణ్, పోలీస్ సిబ్బంది, ఆర్‌ఎంపీ, పీఎంపీలు పాల్గొన్నారు.