అంగన్వాడీ కేంద్రం సందర్శన..

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కేంద్ర ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ గామినీ సింగ్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామం అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. అక్కడ మాతా శిశు సంక్షేమానికి సంబంధించిన సేవలను ఆమె పరిశీలించారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణను, పిల్లల మానసిక, శారీరక అభివృద్దిని, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ విధానాన్ని, ఒక పూట సంపూర్ణ భోజనం, పోషణ్ ట్రాకర్ యాప్ పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట జడ్పిటిసి అనూరాధ, రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ ప్ర్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎన్ మోతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, సిడిపిఓ చంద్రకళ, సూపర్వైజరు జంగమ్మ ఉన్నారు.
Spread the love