- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ కంపెనీ వోక్స్‌వ్యాగన్ సంస్థ తన కొత్త ఎస్‌యూవి ‘టైరాన్ లైఫ్’ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ. 41.99 లక్షలుగా నిర్ణయించింది. ఇది టాప్ ఎండ్ ఆర్ లైన్ వేరియంట్ కంటే రూ. 5 లక్షలు తక్కువ. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చగా, 204హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో, ఆల్-వీల్ డ్రైవ్ సామర్థ్యంతో వస్తోంది. ప్రీమియం మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉంటాయని వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ తెలిపారు.
- Advertisement -


