అనారోగ్యంతో వీఆర్ఏ కుమారుడు మృతి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ పల్లి గ్రామానికి చెందిన కాందర్ దాసరి మహేందర్ తన తండ్రి  దాసరి నర్సయ్య వయసు పైబడి ఇంటివద్దే ఉంటున్నాడని తండ్రికి రేయింబవళ్ళు అండగా ఉండటానికి తండ్రి వీఆర్ఏ ఉద్యోగం దాసరి మహేందర్ (మహేష్) చేసేవాడని, అలాంటి యువకుడు దాసరి మహేందర్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. శుక్రవారం  ఆసుపత్రి  లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దాసరి మహేష్ గత కొన్ని ఏళ్లుగా గ్రామంలో ఎన్నో కార్యక్రమాల్లో  ముందుండి గ్రామ పంచాయతీ నుంచి గ్రామస్థులకు ఎళ్ళవేళల సేవలందించే వాడని, ముఖ్యంగా గ్రామంలో జాతర, శ్రీరామ నవమి లాంటి పెద్ద పెద్ద పండగల్లో కూడా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని పై ఉన్న నిబద్దతతో ఇష్టంతో దాసరి మహేష్  కష్టపడి గ్రామానికి సేవలను అందించాడని పేర్కొన్నారు. అంతేకాకుండ ప్రతి నేలా వృద్దులకు పెన్షన్ ఇచ్చే సమయంలో వారిని క్యూ లో ఉంచుతూ మంచినీళ్లు అందిస్తూ వారికి సహాయపడటం చేస్తుండేవాడని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో కరోనా బారిన పడిన వ్యాధిగ్రస్థులకు (వేరే ఉరివాళ్లకు మోడల్ స్కూల్ లో విదులు )వారి కుటుంబ సభ్యులు రాకున్నా సేవలు అందించాడని, కరోనా సమయంలో చనిపోయిన వారికి అంత్యక్రియల్లో క సహాయం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.మహేష్ కు గల్ఫ్ దేశాల్లో ఎంతోమంది మిత్రులు ఎక్కువ జీతాలు ఉన్న తాము వీజా పంపుతా మన్న నాన్న లాగే ఊరిమీద ఉన్న ఇష్టంతో చాలి చాలని వేతనంతో విధులు నిర్వహించేవాడని వారన్నారు.తన తండ్రి  దాసరి నర్సయ్య 61ఏళ్ళు పైబడటంతో ఉద్యోగం చేయోద్దని,గత బిఅర్ఎస్ ప్రభుత్వం విఆర్ఎ లకు వయస్సు పైబడుతే తమ వారసులకు అని ఉద్యోగం అందజేస్తామని ప్రకటించారు.కాని నర్సయ్య కుమారుడు మహేందర్ రోజు వారిగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం నుండి అధికారికంగా ఉద్యోగం రాలేదని పలువురు తెలిపారు. అలాంటి యువకుడు మృతి చెందాడం దురదృష్ట కారణమని వారు అవేదన వ్యక్తం చేశారు.
Spread the love