
మండలంలోని మేడారం, దాని పరిసర గ్రామాల్లో కూడా గురువారం మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ వాల్ పోస్టర్లు ఆదివాసి యువజన సంఘం (ట్రైబల్ యూత్ అసోసియేషన్) పేరుతో వెలవడంతో స్థానికంగా కలకలం రేపుతున్నాయి. శాంతియుత జీవనం మన హక్కు అనుమానితుల సమాచారం ఇద్దాం.. పోలీస్ శాఖకు సహకరిద్దాం.. మావోయిస్టు వద్దు అభివృద్ధి ముద్దు అంటూ గురువారం వాల్ పోస్టర్లు వెలిశాయి. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న తాడ్వాయి మండలంలోని వివిధ ఆదివాసి గ్రామాల్లో ఒకసారిగా మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం పేరుతో వాల్ పోస్టర్ వేయడం స్థానికంగా ఉన్న తాడ్వాయి ఏజెన్సీ ఆదివాసి గ్రామాల ప్రజలు, వలస ఆదివాసి గ్రామ ప్రజలు ఒకసారిగా ఉలిక్కిపడ్డారు.