
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాష్ట్ర వక్ఫ్ బోర్డు చేతగానితనం వల్ల యదేచ్చగా భువనగిరి జిల్లాలో వందల ఎకరాలు ఆక్రమణ గురవుతున్నాయని వక్ఫ్ భూములను కాపాడే బాధ్యత ప్రభుత్వాన్నిదని, కొంతమంది కబ్జాదారులు, రాజకీయ నాయకుల చేతుల్లో వక్ఫ్ భూములు ఉన్నాయని దీనిని జిల్లా యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. భువనగిరి పట్టణంలో వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నా చేష్ఠలుడిగిన జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వక్ఫ్ భూముల సమస్య పై అఖిలపక్ష సమీక్ష సమావేశం నిర్వహించాలి అని వారు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.