
– సిబ్బంది వెతలు..
– అత్యవసర శాఖపై అధికారుల ఇంత నిర్లక్ష్యం ఎలా?
నవతెలంగాణ – అశ్వారావుపేట
నీరు, నిప్పు, గాలి జీవ జాలానికి ఎంత అత్యవసర మో వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం అంతకంటే ప్రాణాపాయం. ప్రమాదం ఏదీ చెప్పిరాదు.ఎవరి ప్రాణం చెప్పి పోదు. ఇవి ప్రకృతి సూత్రాలు. నిప్పు కి విరుగుడు నీరే.మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ నీరే లేకపోతే.అంతా భస్మం మే కదా.
ప్రభుత్వం భవనం అయినా,వ్యక్తిగతం గృహం అయినా ముందుగా నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్న తర్వాతే ఆయా భవనాలు నిర్మాణం చేపడతాం.ఎందుకంటే నీరు లేకుండా ఏ పని జరగదు కాబట్టి.అలాగే అగ్నిమాపక కేంద్రం అంటేనే అత్యవసరం,అగ్నిమాపకం చేసేది.మరి ఇలాంటి శాఖ భవనానికి నీటి వసతి,సౌకర్యం లేకుండా ఎలా నిర్మించారు అంటే అంతే అది ప్రభుత్వ శాఖ ది కాబట్టి. ఇక విషయానికి వద్దాం. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ప్రస్తుతం నిర్వహిస్తున్న అగ్నిమాపక శాఖ కేంద్రాన్ని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1987 లో 38 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసారు. నాడు అశ్వారావుపేట, దమ్మపేట, వెలేరుపా డు, కుక్కునూరు, ములకలపల్లి మండలాల వరకు ఈ అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఉండేవి. నియోజక వర్గాల పునర్విభజనలో 2009 లోనే అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్ లి, కుక్కునూరు, వెలేరుపాడు మండలాలతో అశ్వారావుపేట నియోజక వర్గం ఉనికిలోకి వచ్చినప్పటికీ 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందడం,మండలాల పునర్విభజన తో కుక్కునూరు వెలేరుపాడు ఆంధ్రప్రదేశ్ లో విలీనం కావడంతో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్ లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్ లి మండలాలతో అశ్వారావుపేట కొత్తగా రూపొందింది. అయితే నియోజక వర్గంలో అశ్వారావుపేట,దమ్మపేట మండలాల వరకే ఈ అగ్నిమాపక కేంద్రం పరిమితం అయింది. ఇంత చరిత్ర ఉన్న ఈ అగ్నిమాపక కేంద్రానికి స్వయంగా నీళ్ళు నిలువ చేసుకోవడానికి బోరు బావి నిర్మించుకోవడం తో వ్యవసాయ కళాశాల,కెమీలాయిడ్స్,శ్రీలక్ష్ మీ తులసి పేపర్ బోర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణాల్లో గల బోరుబావులు నుండి అగ్నిమాపక యంత్రంలో నీటిని నింపుకుని అగ్నిమాపక విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రానికి చుట్టూ ప్రహరీ గోడ సైతం లేకపోవడం తో రక్షణ కరువైంది.లోపల పెంచిన హరిత హారం మొక్కలు పశువులు బారినపడి ఉపయోగం లేకుండా పోతుందని సిబ్బంది వాపోతున్నారు.
అంతే కాదు ఉద్యోగోన్నతి పొంది కొద్దిరోజుల్లో రిటైర్డ్ కాబోయే వారే ఈ అగ్నిమాపక కేంద్రానికి అగ్నిమాపక అధికారులు బదిలీ అవడం,రిటైర్డ్ కావడం సర్వసాధారణం.
అయితే ఈ అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఆఫీసర్ 1,ఎల్.ఎఫ్.ఎం లు 2,డీఓపీ (డ్రైవర్ )లు 3,ఎం.ఎం లు 10 మంది,మొత్తం 16 మంది సిబ్బంది కి బదులు 11 మంది మాత్రమే ఉన్నారు.5 పోస్ట్ లు ఖాలీగా ఉన్నాయి.ఈ అయిదుగురు ఎం.ఎం లే కావడం విశేషం. ఈ కేంద్రానికి రెగ్యులర్ ఫైర్ ఆఫీసర్ కేటాయించి,బోరుబావి నిర్మించి నీటి ని అందుబాటులోకి తీసుకురావాలని,ఖాలీ పోస్ట్ భర్తీ చేసి సిబ్బంది కొరత తీర్చాలని,ప్రహరీ నిర్మించి రక్షణ కల్పించాలని ఫైర్ సిబ్బంది ప్రజాప్రతినిధులను కోరుతున్నారు,పలు పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.