
మండలంలోని కన్నాపూర్ లో సోమవారం దళితవాడలో భీమ్ సేన సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి సొంత డబ్బులతో వాటర్ ట్యాంకు నిర్మించి అంబేద్కర్ జయంతి సందర్భంగా వాటర్ ట్యాంకును మాజీ సర్పంచ్ రాజనర్సు, పంచాయతీ కార్యదర్శులు లావణ్య చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో సభ్యులు నవీన్, కర్రోల సతీష్, డప్పు రాజనర్సు, కర్రోల రాజేందర్, చిన్న నరేష్, లింగం, మహేష్, బాలరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.