Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ సీతారాంరెడ్డి ఆశయాలను సాధించాలి

కామ్రేడ్ సీతారాంరెడ్డి ఆశయాలను సాధించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు
నవతెలంగాణ-నెల్లికుదురు 

కామ్రేడ్ నెలకుర్తి సీతారాం రెడ్డి ఆశయాలు వృధా కాదనీ, ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు అన్నాడు. మండల పరిధిలోని బంజర గ్రామంలో గురువారం సీతారాంరెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ సీతారాం రెడ్డి  బానిసత్వానికి వ్యతిరేకంగా.. సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాటాలను చేశాడని అన్నారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా.. భూమి భుక్తి విముక్తి కోసం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా దున్నేవారికి భూమి పంచాలని ఉద్యమాలు చేశాడని గుర్తు చేశాడు.

భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో తను వెనుతిరగకుండా పోరాటాలలో ముందున్నారని చెప్పారు. కూలి ధరలు పెంచాలని, భూమి పంచాలని పోరాటాలు చేశాడని తెలిపాడు. కమ్యూనిస్టు కార్యకర్తగా తుది శ్వాస విడిచెంతవరకు కూడా ఎర్రజెండా మార్గంలో నడిచాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో నెలకుర్తి వెంకటరెడ్డి, స్వరూప, గుండెపాక నరసయ్య, బండ వెంకన్న, దేవేందర్, జె.వెంకటరత్నం, గుగులోతు శ్రీనివాస్, కొత్త లక్ష్మి, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -