మారోజు వీరన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి

నవతెలంగాణ –  తిరుమలగిరి
మారోజు వీరన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ అన్నారు. బుధవారం తిరుమలగిరి పట్టణం వంగపల్లి నర్సయ్య ఫంక్షన్ లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన దళిత బహుజన స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ మలిదశ ఉద్యమ స్థాపికుడు మారోజు వీరన్న 62వ జయంతి ఉత్సవాల ముగింపు సభకి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ డా. తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్  మాట్లాడుతూ.. మారోజు వీరన్న జయంతి అధికారికంగా నిర్వహించాలని, ట్యాంక్ బండ్ మీద వీరన్న విగ్రహం పెట్టాలని, ఏదైనా జిల్లాకు వీరన్న పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన విశ్వకర్మలకు చేయూత పథకం వర్తింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మారోజు సోమాచారి, మహిళ అధ్యక్షురాలు మారోజు సృజన( వీరన్న బిడ్డ), మారోజు పండు (వీరన్న అన్న), ఆరాధ్య ఫౌండేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు తాడోజు ఆచారి, ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులు పర్వతం వెంకటాచారి, ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులు రామబ్రహ్మం, ప్రముఖ గాయకులు దరువు అంజన్న, గిద్దె రామనర్సయ్య, సుక్క రామనర్సయ్య, విశ్వబ్రాహ్మణ జనగాం జిల్లా దీగోజు నర్సింహాచారి, విశ్రాంత ఉపాధ్యాయులు గురుమూర్తి,సీనియర్ నాయకులు దీన్ దయాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు,వడ్ల సాయి కృష్ణ చారి,విశ్వబ్రాహ్మణ తిరుమలగిరి మండల అధ్యక్షులు, ఏమోజు రవీందర్ చారి, విశ్వకర్మ మండల అధ్యక్షులు మారోజు ఈశ్వర చారి, అడ్డబొట్టు చారి, నాని తదితరులు పాల్గొన్నారు.
Spread the love