నవతెలంగాణ – ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సర్టిఫికెట్లు ఇవ్వని వైనంపై హైకోర్టులో ఉచితంగా న్యాయ సహాయం చేసి విద్యార్థుల అండగా నిలిచిన నిర్మల్ కు చెందిన హైకోర్టు న్యాయవాది తక్కురి చందన న్యాయ సహాయం పై సర్వత్రా హర్షం ర్షం వ్యక్తం అవుతుంది. పూర్తి వివరాలు కెళ్తే.. బాసర
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సర్టిఫికెట్లు ఇవ్వని వైనంపై హైకోర్టులో ఉచితంగా న్యాయ సహాయం చేసి విద్యార్థుల అండగా నిలిచిన నిర్మల్ కు చెందిన హైకోర్టు న్యాయవాది తక్కురి చందన న్యాయ సహాయం పై సర్వత్రా హర్షం ర్షం వ్యక్తం అవుతుంది. పూర్తి వివరాలు కెళ్తే.. బాసర
ట్రిపుల్ ఐటీ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం పీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా విడుదల చేయటం లేదు. దీంతో ట్రిపుల్ ఐటీ లో విద్యను పూర్తిచేసిన విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయక పోవటంతో విధ్యార్థుల కు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం సర్టిఫికెట్లను ఇవ్వటం లేదు. దీంతో ప్రభుత్వమన్నా పీజు కట్టాలి, లేదా విద్యార్థి నా కట్టాలని షరతు విధించడంతో విద్యను పూర్తి చేసిన విద్యార్థులు పై చదువుల కోరకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి నల్లగొండ జిల్లాకు చెందిన సామల పణీ కుమార్ సర్టిఫికెట్ కోసం తాను పడుతున్న బాధను నిర్మల్ ప్రాంతానికి చెందిన హైకోర్టు న్యాయవాది తక్కురి చందనకు వివరించారు. ఆ న్యాయవాది ఉచితంగా న్యాయ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఈనెల 22 విద్యార్థి తరఫున హైకోర్టులో ట్రిపుల్ ఐటీపై కేసు వేశారు.
గత రెండు రోజులుగా హైకోర్టులో వాదనలు జరిగాయి. శుక్రవారం హైకోర్టు విద్యార్థి సామల ఫణికుమార్ కు సోమవారం కల్లా సర్టిఫికెట్లు అందజేసి, మంగళవారం కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసును సమర్థవంతంగా వాదించి విద్యార్థికి అండగా నిలవటమే కాకుండా ,మీగితా విద్యార్థులకు ఊరట కలిగించడంలో సప్లికృతమైన న్యాయవాది చందన కృషి పై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నది.ఈ సందర్భంగా న్యాయవాది తక్కురి చందన శుక్రవారం రాత్రి నవ తెలంగాణతో ఫోన్లో మాట్లాడారు. తాను నిర్మల్ లో పుట్టి పెరిగానన్నారు.మన ప్రాంతంలో జరిగే అన్యాయాలపై ఎదిరించడానికి, తనవంతు న్యాయం చేస్తానని తెలిపారు. ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులకు న్యాయం సహాయం చేయడానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రకటించారు. హైకోర్టులో ఇప్పటికే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగ బద్ద అంశాలు,సివిల్, క్రిమినల్ కేసులతో పాటు ఆయా కేసుల్లో వాదిస్తున్నని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తరఫున తాను కేసు వాదించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పేదలకు న్యాయ సహాయం అందించడానికి ఎల్లప్పుడూ తన వంతుగా అండగా ఉంటానని స్పష్టం చేశారు.