విప్లవ వీరుల ఆశయాలను కొనసాగిస్తాం… 

– భగత్ సింగ్ జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
– ఏఐవైఎఫ్  జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదవ్ ఆశయాలను కొనసాగిస్తామని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో విప్లవ వీరుల 93 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ అమలు చేయాలన్నారు. భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల యొక్క  పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కొరకు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామన్నారు, అతి చిన్న వయసులో దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన రియల్ హీరోలని కొనియాడారు. నాడు స్వేచ్ఛ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కొరకు అనేకమంది ప్రాణ త్యాగాలు చేసిన వారిలో భగత్ సింగ్, రాజ్ గురు,  సుఖదేవ్ లని గుర్తు చేసుకున్నారు, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభం కోసం కులాలకు,మతాలకు మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. యువత భవిష్యత్ తరాల కోసం నాడు స్వాతంత్రోద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని అన్నారు. బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడానికి భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్ల యొక్క పోరాట స్ఫూర్తితో విద్యార్థులను, యువకులను చైతన్య పరుస్తామన్నారు. నిరంకుశ వైఖరితో నడుస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అయిలేని సంజీవ రెడ్డీ ,యువ మహిళా జిల్లా కన్వీనర్ రాయకుంట మంజుల, ఏఐవైఎఫ్ హుస్నాబాద్ మండల అధ్యక్ష కార్యదర్శులు తొందూరి రేవతి, జంగం ప్రశాంత్, ఒద్దిరాల అజయ్ రమేష్, ఆనందం,బాలరాజు మహేందర్ , రింకు, సంజన,నిహన్, చిన్ను  తదితరులు పాల్గొన్నారు.
Spread the love