రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం…

– 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం..
– ఉద్యోగులకు ఒకటిన జీతాలు ఇస్తున్నాం..
– తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించండి : ఎమ్మెల్యే కుంభం 
నవతెలంగాణ-  భువనగిరి :  రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని  ఐదు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్ వి హోటల్లో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లపాటు  కెసిఆర్  ప్రభుత్వంలో  రాష్ట్ర నష్టపోయిందని  కుల కుప్పగా  చేశారని ఆరోపించారు. కాలేశ్వరం లో నీళ్లు లేక రైతులు పంటలు వేసే పరిస్థితి లేదన్నారు. ఆగస్టులో రైతులకు రెండు లక్షల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తారని చెప్పారన్నారు.  ధాన్యము కొనుగోలు విషయంలో సఫలీకృతం అయ్యామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో ఐదు నెరవేర్చామన్నారు. బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ టాపింగ్ చేసి వ్యక్తిగత జీవితాలలో తొంగి చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషిచేసిన వ్యక్తులలో తీన్మార్ మల్లన్న ఒకరు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే పట్టబద్రులు మా పక్షాన ఉన్నారంటూ  తప్పుడు సంకేతం వెళ్తాదన్నారు. మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను  కోరారు. ఈ సమావేశంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, టిపిసిసి డెలికేట్ రవికుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రమోద్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, నాయకులు  డి రాములు కుక్కదూవ్వు సోమయ్య, బర్రె నరేష్, గుర్రాల శ్రీనివాస్,  నాగరాజు పాల్గొన్నారు.
Spread the love