నవతెలంగాణ -పెద్దవూర
మండలం లోని ఊట్లపెల్లి గ్రామంలో శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సాయిధ తెలంగాణ రైతాంగ పోరాటయోధుల వారోత్సవాలు పార్టీ మండల కార్యదర్శి దుబ్బరామచంద్రయ్య ఆధ్వర్యంలో ప్రారంభమాయ్యాయి. ఈసందర్బంగా మాట్లాడుతూ గ్రామంలో భీరెడ్డి రంగారెడ్డి, మర్రి నరసయ్యలు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని భూమి భక్తి కొరకు ఎట్టి చాకిరి విముక్తి కొరకు భూ పోరాటాలు చేశాని అన్నారు. కూలి రేట్ల పెంపు కొరకు అనేక పోరాటాలు చేసి భూములు పేదలకు పంచి పెట్టిన ఘనత వీరికే దక్కిందని తెలిపారు.
నైజాము నవాబు కాలంలో ఎట్టి చాకిరి విముక్తి కొరకు పోరాటాలు నడిపి జైలు జీవితం గడిపిన ఘనత కామ్రేడ్లు రెడ్డి రంగారెడ్డి, నరసయ్య అని కొనియాడారు. ఈ వారోత్సవాల సందర్భంగా భీరెడ్డి రంగారెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని సీపీఐ(ఎం) నాయకులు శాలువాతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు దుబ్బ ఏడుకొండలు, దొంతాల నాగార్జున, సిఐటియు జిల్లా నాయకులు చిలుముల దుర్గయ్య, మండల నాయకులు గజ్జల కృష్ణారెడ్డి, దుబ్బ సీనయ్య, బెజవాడ అంజయ్య గ్రామస్తులు ఉన్నారు.