పాదయాత్రకు స్వాగతం పలికిన చింతల…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ఈ నెల 27 న వరంగల్ లో జరిగే “బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కావాలని బీఆర్ఎస్వీ  ఆధ్వర్యంలో వేములకొండ నుండి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వరకు చేస్తున్న సందర్భంగా గురువారం భువనగిరికి చేరుకోగా, పాదయాత్ర బృందానికి బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ మొత్తం బిఆర్ఎస్ పార్టీ దే అని అన్నారు. గ్రామాలలో మండలాలు నాయకులు క్షేత్రస్థాయి సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పిఎసిఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర రెడ్డి, మాజీ జడ్పీటిసి సందేల సుధాకర్, మాజీ మోత్కూరు మార్కెట్ చైర్మన్ చిప్పలపెల్లి మహేంద్ర, అడ్వకట్ సామ రాజేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ జిల్లా నాయకులు కుతాడి సురేష్, బిఆర్ ఎస్ వి, బిఆర్ఎస్వై నాయకులు పాదయాత్ర సభ్యులు, వల్లమల్ల కృష్ణ, కడారి స్వామి యాదవ్, బూరుగు నవీన్ గౌడ్, శిగ వెంకట గౌడ్, నాగారం ప్రశాంత్, బలెంల అవినాష్, కృష్ణ,ప్రవీణ్, నాయకులు దండాబోయిన బాలరాజు, పల్లపాటి రవికుమార్, గాజుల నవీన్ గౌడ్, శేషు, దోసపాటి హరీష్, మోతే మనోహర్, కట్కూరి నరేష్ లు పాల్గొన్నారు.

Spread the love